KCR:12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌దే గెలుపు

24
- Advertisement -

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఆరో రోజుకు చేరింది. ఖమ్మం రోడ్డు షోలో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ లో వరిపంట పంజాబ్ తో పోటీ పడే స్థితిలో 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తే నామా అద్వర్యంలో పోయి అడిగితే కేంద్రం కొనలేదు. పైగా కేంద్రమంత్రి నూకలు తినమని అన్నాడన్నారు. గోదావరి నీళ్లను కేంద్రం ఎత్తుక పోతానంటే ఇక్కడవున్న కేంద్రమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరుస్తాలేరు. మరి ఈ దద్దమ్మలు ఎందుకు మనకు.?, నేను ముఖమంత్రిగా ఉన్న టైం లో ఈ ప్రతిపాదనను పెట్టిండు మోడీ నా ముందల. నా తెగిపడ్డా ఒప్పుకోనని చెప్పిన.. బీజేపీ కి 200 సీట్లు కూడా వస్తలేవు అంతా వుత్తదే అన్నారు.

దాదాపు 12 పార్లమెంటు సీట్లు మనం గెలువబోతున్నాం, ఏ కూటమికి మెజారిటీ రాట్లేదు. మనం ఎక్కువ ఎంపీలను గెలిస్తే రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో నామ నాగేశ్వర్ రావు కేంద్రమంత్రి అయితాడు.. మన గోదావరి కృష్ణ నదులను ఇంకా అనేకమైన మన హక్కులను మనం కాపాడు కోవాలన్న బీఆర్ఎస్ నే గెలిపించుకోవాలన్నారు. దీక్ష సమయంలో ఖమ్మం నాకు అండగా నిలిచింది. అన్ని సంఘాలు వర్గాలు నాకు మద్దతినిచ్చాయి. నేను ఎన్నడూ మర్చిపోను అన్నారు కేసీఆర్.మన ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చినం..ధాన్యం కొన్నాం .. కరెంటు ఇచ్చినం..రైతుకు వ్యవసాయానికి ఎంతో చేసినం, దున్నేవానికి భూమి తినేవానికి ఇస్తారాకు గీకితోనికే గుండు అని ఎన్నో నినాదాలు తెచ్చిండ్రు కమ్యూనిస్టులు అన్నారు.

అమ్మను చూడు అవుదూడ కొమ్మను చూడు కూసో కూసో అన్నారు కానీ వీరెవరూ చేయని సంక్షేమాన్ని కేవలం ఆనాడు ఎన్టీఆర్ మహానీభావుడు చేసి చూయించిండు,ఎన్టీఆర్ వచ్చినంకనే మనందరికీ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇంకా అనేక పథకాల ద్వారా సంక్షేమం అందించిండు అన్నారు. ఎన్టీఆర్ తర్వాత మన తెలంగాణ ప్రభుత్వంలో ..ఎన్టీఆర్ ను మించి సంక్షేమం అమలు చేసుకున్నాం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అలవిగాని హామీలిచ్చింది..ఇప్పడు ఇచ్చిన హామీలన్నీ ఎటుబాయే.? అని ప్రశ్నించారు. తులం బంగారం తుస్సు మన్నది… అడిగితే కాంగ్రెస్ కస్సు మంటున్నదని విమర్శించారు.

రుణమాఫీ ఆరు గ్యారెంటీలు ఆగస్టు 15 కల్లా గనుక అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానంటే సీఎం ఎందుకు పోలేదు.?, మహిళకు 2500 ఇస్తామన్నారు ఏమైనాయి.? ఇచ్చిండ్రా .?, హామీలు అమలు చేయమని అంటే…నీ గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా..పండబెట్టి తొక్కుతా.. నీ పేగులు దీసి మెడల యేసుకుంటా.. నిన్ను చెర్లపెల్లి జైళ్లేస్తా అని కూతలుకుస్తుండు ఒక ముఖమంత్రి ఇట్లా మాట్లాడొచ్చా.?, తెలంగాణ సాధించిన నన్ను పట్టుకుని అడ్డగోలుగా తిడుతుండు..ఈ బాషేంది ?, నేను జైళ్లకు తోకమట్టకు భయపడితే తెలంగాణ వచ్చునా?, ఎన్నికలు అయిపోయిన తెల్లారి రేవంత్ బీజేపీ లోకి జంప్ కొడుతాండ్రంటే సీఎం ఒకనాడు స్పందిస్తాలేదు కారణం.?, రైతుల పంటలు ఎండబెట్టిండ్రు తప్ప నీళ్లు ఇవ్వలే, యుద్ధం జెద్దామా పోరాడుదామా.?, కేసీఆర్ పక్కకు జరుగంగానే నీళ్లు ఆగిపోతాయా, యువత ఒక ఒరవడిలో కొట్టుకు పోకుండా ఆలోచించాలి భవిత మీదే అన్నారు.

Also Read:కొత్తిమీరతో ప్రయోజనాలు..!

- Advertisement -