కాళేశ్వరంతో నిజాంసాగర్ నిండా నీళ్లే…

221
kcr banswada
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నిజాం సాగర్ ప్రాజెక్టు నిండా 365 రోజులు నీళ్లు ఉంటాయని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్…లక్ష్మీపుత్రుడు పోచారి శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పోచారం వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత రైతాంగం దశ మారిపోయిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్రంతో పాటు బాన్సువాడకు అద్భుతమైన సేవలను అందిస్తున్నారని కేసీఆర్ కొనియాడారు.

కాంగ్రెసోళ్లకు తెలివి లేదని వారు అధికారంలోకి వస్తే తెలంగాణ చీకటి అవుతుందన్నారు. నిజామాబాద్‌లో కరెంట్ లేదని నరేంద్ర మోడీ పచ్చి అబద్ధం మాట్లాడరని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంతా ప్రజల కళ్ల ముందే ఉందన్నారు. రాష్ట్ర సంపదను పెంచి రైతులకు, పేదలకు పంచుతున్నామని చెప్పారు.

రెండు తరాలకు ఉపయోగపడే విధంగా ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టామని టీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తే రూ. లక్ష రుణమాఫీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

చందూర్, మోస్తరను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని, బాన్సువాడకు డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామని హామీ ఇస్తున్నాను. మన సభలకు వచ్చినంత మంది కూడా బీజేపీ సభలకు రావడం లేదన్నారు.

- Advertisement -