దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కంకణంకట్టుకున్న సీఎం కేసీఆర్ తన ప్రయత్మాల్లో వేగం పెంచారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన కేసీఆర్ ఆయన ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలిసిన కేసీఆర్ అనంతరం డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్ తో భేటీ అయ్యారు.
భేటీ అనంతరం సీఎం కేసీఆర్, స్టాలిన్ లు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మాట్లాడుతూ..భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, గుణాత్మక మార్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. అలాగే ఈ భేటీలో స్టాలిన్‌తో చాలాఅంశాలతో చర్చించామని వెల్లడించారు కేసీఆర్. కేంద్రం రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని అన్నారు. జపాన్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చూస్తున్నామని, ముఖ్యంగా కేంద్రం విదేశీ వ్యవహారాలపై దృష్టి సారించాలి తెలిపారు.
తెలంగాణలో చాలా అద్భుతమైన పథకాలను అమలుచేస్తున్నామని, రైతుకు ఎకరాకు రూ.8వేల చొప్పున పంట సాయం అందిస్తున్నామని చెప్పిన కేసీఆర్..రైతు బంధు పథకం ప్రారంభోత్సవానికి స్టాలిన్ ని ఆహ్వానించామని వెల్లడించారు. అంతేకాకుండా నేను చాలా కాలం తర్వాత చెన్నై వచ్చానని చెప్పిన కేసీఆర్, మొదటి యూపీఏ ప్రభుత్వంలో కలిసి పని చేసినట్టు కూడా తెలిపారు. కాగా.. కరుణానిధి తనకు మంచి పుస్తకాలు బహుకరించారని తెలిపారు.
ప్రస్తుతం దేశాభివృద్ధికి సహకరించేలా లేవని, తృతీయ ఫ్రంట్ విషయంల్లో దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా..సీఎం కేసీఆర్ వెంట మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కేకే, వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.