ధరలు పెరిగి రైతులకు భారమైంది కాబట్టి రూ. 25వేలు ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు చెల్లించాలి. ఇది చేసేంత వరకూ మిమ్మల్ని వెంటాడతం, వేటాడతం, ధర్నాలు చేస్తాం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎట్టి పరిస్థితుల్లో వందకు వందశాతం రైతుల పక్షాన పోరాటం చేస్తాం. మీ అసమర్థత వల్ల పొలాలు ఎండిపోయినవి కాబట్టి.. వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి పంటలను లెక్కించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఏ గ్రామంలో ఏ రైతు పంట ఎంత ఎండిందో లెక్క తీయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎండిన పంటలకు ప్రతి ఎకరాకు రూ. 25వేల నష్ట పరిహారం ఇవ్వాలని…ఇప్పటికే కాంగ్రెస్ తెచ్చిన కరువుతో 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రైతుల పంటలెండుతుంటే గుడ్డిగుర్రాల పండ్లు తోముతున్నారా? వీరు రైతులు కాదా? ఎండేవి పంటలు కాదా? మీకెవరికీ పట్టింపు లేదా? రైతుల తరఫున ప్రశ్నించేటోళ్లు ఎవ్వరూ లేరనుకుంటున్నారా? అన్నారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము దానికి న్యాయం చేయాలి… రాష్ట్రంలో మా బీఆర్‌ఎస్ దళాలు తిరుగుతున్నయి. మేము కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాం. మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తిరుగుతున్నరు. మీకు చేతగాకపోతే కచ్చితంగా అన్ని లెక్కలు తీస్తాం అన్నారు. నేను వస్తున్నానని పేపర్లలో వార్తలు రాగానే కాల్వలల్లో తెల్లారిందాక నీళ్లు వదిలారన్నారు.
Also Read:చర్మం నల్లబడుతుందా..ఇలా చేయండి!