KCR:బండి సంజయ్‌తో పైసా పనికాదు?

17
- Advertisement -

గత ఐదేళ్లలో బండి సంజయ్‌ తో పైసా పని కాలేదు.. ఎంపీగా గెలిచి చేసిందేమీ లేదు అని మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. న్యాయవాది, ఉద్యమాల బిడ్డ, తెలంగాణ ఆకాంక్షలు తెలిసిన వినోద్ కుమార్ ను గెలిపించాలని కరీంనగర్ ప్రజలను కోరుతున్న అన్నారు. కరీంనగర్ రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్..మోడీ కన్న ముందున్న 14 మంది ప్రధాన మంత్రులు కేవలం 55 లక్షల కోట్ల అప్పు చేస్తే..మోడీ ఒక్కడే 105 లక్షల కోట్ల అప్పు చేసిండు..అయినా ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదు అన్నారు.

పోయినసారి మంచికో చెడ్డకో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. నాలుగు రూపాయల పనైనా చేశారా? ఎంతసేపు లొడలొడా మతం పిచ్చి.. అదోటి ఇదొటి మాట్లాడడం.. పంచాయితీలు పెట్టించు తప్ప ఎవరికేమైనా లాభం జరిగిందా?ఆలోచించాలన్నారు.

కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ చేయించిందే వినోద్‌ కుమార్‌. ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్‌ను రోజు నాతో కొట్లాడి రూ.2వేలకోట్లు తెచ్చి ప్రతి రోడ్డునూ బ్రహ్మాండం సుందరంగా తీర్చిదిద్దింది గంగుల కమకలార్‌ అని గుర్తు చేశారు కేసీఆర్.

Also Read:భజే వాయు వేగం…ఫస్ట్ లిరికల్

- Advertisement -