KCR:బడ్జెట్ ఒట్టి డొల్లా?,ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం

31
- Advertisement -

రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కేసీఆర్, ప్రభుత్వానికి ఓ పాలసీ, విధానం లేదని దుయ్యబట్టారు. మేం రెండు పంటలకు రైతు బంధు ఇస్తే ఈరోజు దానిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఈ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చాం ఇకపై చీల్చిచెండాడుతామని తెలిపారు. ఇది ఖచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని, దళితబంధు ప్రస్తావన లేదన్నారు. గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారన్నారు. రైతును పొగిడినట్లే పొగిడి నట్టేట ముంచారన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు.

కథ చెప్పారు తప్ప, బడ్జెట్‌లా లేదని, ఈ బడ్జెట్ అంతా ట్రాష్ అన్నారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వమని, భట్టి బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉందని ఆరోపించారు. ఆర్ధికమంత్రి ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తగా ఏమి లేదన్నారు. ఐటీ, పారిశ్రామిక పాలసీ ఏది అని ప్రశ్నించారు. రైతు భరోసాలో అన్ని ఆంక్షలు పెడుతున్నారన్నారు. దళితులంటే ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా? అని ప్రశ్నించారు. బడ్జెట్ ఒట్టి డొల్ల అని ఆరోపించారు.

Also Read:BRS:కాళేశ్వరంకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

- Advertisement -