BRS:పీవీ సేవలు మరువలేనివి

5
- Advertisement -

దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్.పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు.

నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు, భారతజాతి ముద్దుబిడ్డ పీవీ అని చెప్పారు. తెలంగాణ బిడ్డగా మనందరం గర్వపడాల్సిన పీవీ నరసింహారావు అందించిన స్ఫూర్తి మరువలేనిదని తెలిపారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో పీవీ జయంతి వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించారు. పీవీ చిత్ర‌ప‌టానికి ఘ‌న నివాళుల‌ర్పించారు కేటీఆర్. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ, ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు నివాళుల‌ర్పించారు. హ‌స్తిన‌లో ప్ర‌ధాని పీఠాన్ని అధిష్టించిన మొద‌టి ద‌క్షిణ భార‌త నాయ‌కులు పీవీ న‌ర‌సింహారావు అని పేర్కొన్నారు. భూసంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా 8 వందల ఎక‌రాల భూమిని స‌ర్కార్‌కు అప్ప‌గించిన గొప్ప నాయ‌కుడు పీవీ. విద్యాసంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టిన మ‌హోన్న‌తుడు పీవీ అని కొనియాడారు.

Also Read:కాల్షియం తగ్గిందా.. ఇవి తినండి!

- Advertisement -