KCR:మహోన్నత వ్యక్తి జయశంకర్

22
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి ( జూన్ 21) సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి త్యాగాలను కృషిని స్మరించుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర కోసం సాగిన చివరి దశ పోరాటంలో, ఉద్యమ రథ సారధిగా తనను ముందు నడుపుతూ ప్రొఫెసర్ జయశంకర్ అందించిన ప్రోత్సాహం జీవితంలో మరువలేనిదని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ సాధన కోసం అనుసరించాల్సిన పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యూహాలకు తన ఉద్యమ కార్యాచరణకు ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన సైద్ధాంతిక నైతిక మద్దతు మహోన్నతమైనదని కేసీఆర్ స్మరించుకున్నారు.

పదేండ్ల పాటు కొనసాగిన బిఆర్ఎస్ ప్రగతి పాలనలో ప్రొ జయశంకర్ స్ఫూర్తి ఇమిడివున్నదని,నేటి రాష్ట్ర ప్రభుత్వం అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరింతగా ఇనుమడిపజేసే దిశగా పాలన అందించిన నాడే మనం వారికి ఘన నివాళి అర్పించిన వారమౌతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read:మంత్రి ఆనంతో బుట్టా రేణుక భేటీ

- Advertisement -