KCR:ఆజన్మ తెలంగాణ వాది జయశంకర్..

10
- Advertisement -

ఆజన్మ తెలంగాణ వాది ప్రొఫెసర్. జయశంకర్ అని కొనియాడారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ దశాబ్ది ఆవిర్బావ వేడుకల్లో భాగంగా మాట్లాడిన కేసీఆర్… ఆనాడు నా సలహాదారుగా, సహచరుడిగా రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి మాన్యులు జయశంకర్ అని కొనియాడారు.

కఠోరమైన సిద్ధాంతాలను నమ్మే పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చిందంటే దాన్ని పక్కనవెట్టి కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ కూడా ఆ కోవలోకే వస్తాడన్నారు. మీ ప్రస్థానం ఎలా మొదలైంది సార్‌ అని జయశంకర్‌ సార్‌ను అడిగితే.. ఆంధ్రావాళ్లు చేసిన హేళనల గురించి చెప్పారన్నారు. తెలంగాణ వాళ్లను ఆంధ్రాతో విలీనానికి మానసికంగా సిద్ధం చేసే ప్రయత్నాలు జరిగాయన్నారు.

తెలంగాణ అస్థిత్వం కోల్పోవద్దని, తెలంగాణ తెలంగాణగనే ఉండాలని నిర్ణయించుకుని పోరాట పంథా ఎంచుకున్నారు. నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి పిలిచి బెదిరించినా జయశంకర్‌ సార్‌ బెదరలేదు. పోరాట పంథాను వీడలేదు. అలా అనేక సందర్భాల్లో ఆయన బెదిరింపులను ఎదుర్కొన్నారన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని అణచడం కోసం నాటి ప్రభుత్వాలు చేసిన ఘోరాలు అన్నింటికి ఆయన సాక్షిగా నిలిచారన్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థిగా ఉంటూ అనేకసార్లు లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లారు. ఇలా అనేక మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిండ్రు. వాళ్లందరికి మనం తలెత్తి మొక్కాల్సిందేనని భావోద్వేగానికి గురయ్యారు.

Also Read:KCR:తెలంగాణ వాల్లే అవమానించే పరిస్థితి?

- Advertisement -