KCR:తెలంగాణ ధిక్కారస్వరం దాశరథి..

15
- Advertisement -

తెలంగాణ ధిక్కారస్వరం దాశరథి అన్నారు మాజీ సీఎం కేసీఆర్. నేడు దాశరథి శతజయంతి సందర్భంగా..వారందించిన స్పూర్తిని స్మరించుకున్నారు కేసీఆర్.నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా తిమిరంతో సమరం’ చేస్తూ, నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి’ అని కేసీఆర్ కొనియాడారు.

తెలంగాణ సాధనకోసం తాను సాగించిన పోరాట పంథాలో దాశరథి అందించిన స్ఫూర్తి ఇమిడి వున్నదని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం, అభ్యుదయ కవి రచయిత, దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వారందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం సాహిత్యం తెలంగాణ భబిష్యత్తు తరాలకు నిత్య స్ఫూర్తిదాయకమని కేసీఆర్ అన్నారు.

Also Read:Elon Musk: ఏఐ ఫ్యాషన్ షో, మస్క్‌ ట్వీట్‌ వైరల్

- Advertisement -