KCR:కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్

19
- Advertisement -

రాష్ట్రంలో కరెంట్ కోతలపై సోషల్ మీడియా ఎక్స్ ద్వారా స్పందించారు మాజీ సీఎం కేసీఆర్. ఇవాళే ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కేసీఆర్…కరెంట్ విషయంలో రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు.

గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? అని ప్రశ్నించారు.

https://twitter.com/KCRBRSPresident?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1784160091878330836%7Ctwgr%5E3f389725493af41fff43ccc5bfa13ee4b570504b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fbrs-chief-kcr-tweet-on-power-cuts-in-telangana-state-1564362

- Advertisement -