తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ సార్ తెలంగాణ సమాజానికి ఎన్నటికీ స్పూర్తి ప్రధాతగానే నిలుస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ప్రొ.జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు.
స్వరాష్ట్ర ఉద్యమం కోసం తన జీవితాంతం కృషి చేసిన ప్రొ. జయశంకర్ సార్‌ను తెలంగాణ సమాజం ఎన్నిటికీ మరువదని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన నాటి నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం రగిలే వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకుంటూ వచ్చి భావజాల వ్యాప్తికి ధారపోశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. సార్ కలలుగన్నట్టే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ బంగారు తెలంగాణ దిశగా ముందడుగు వేస్తోందని అన్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.తెలంగాణ భవన్‌లో ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయశంకర్‌సార్ విగ్రహానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి జయశంకర్ సార్. జయశంకర్ సార్ ఆశయాలను కేసీఆర్ సాధిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తో పాటు పలువురు టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
స్వ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సర్ ను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని సీఎం శ్రీ కేసీఆర్ అన్నారు. 1/4 pic.twitter.com/XukioeJ3p7
— Telangana CMO (@TelanganaCMO) August 6, 2017