- Advertisement -
మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు, మంద జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారి కృషిని, పార్టీకి వారు అందించిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.మంద జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం గారి మృతి పట్ల తన సంతాపం ప్రకటించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్ కర్నూల్ ప్రజలకు సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యునిగా సేవలందించిన మంద జగన్నాథం మృతి బాధాకరం అన్నారు కేటీఆర్. మంద జగన్నాథం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించిన కేటీఆర్, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
Also Read:భోగి…పరమార్థం ఇదే
- Advertisement -