జయశంకర్..స్ఫూర్తి మరువలేనిది:కేసీఆర్

11
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, ‘నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణ’ అనే సైద్ధాంతిక నిబద్ధతతో రాష్ట్ర సాధనోద్యమ భావజాల వ్యాప్తి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో వారితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, ఉద్యమ సంబంధాన్ని స్మరించుకున్నారు.ఆనాటి ఉద్యమ కాలంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ప్రజలను ఉద్యమం దిశగా చైతన్యం చేసే దిశగా, రాష్ట్ర సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలను, ఎత్తుగడలను అమలు చేసే దిశగా, తాను ప్రారంభించిన మలి దశ ఉద్యమ పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ అందించిన స్ఫూర్తి మరువలేనిది అన్నారు.

తాను చేపట్టిన ఉద్యమ కార్యాచరణకు అనుగుణమైన దిశగా వారిచ్చిన సలహాలు, సూచనలు, ఉద్యమ రథ సారధిగా తనకు కొండంత ధైర్యాన్ని అందించాయని కేసీఆర్ తన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు.ఉద్యమ కార్యాచరణలో తన వెంట నిలిచి, భుజం తట్టి అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ కన్న కలలను నిజం చేసే దిశగా తన కృషి కొనసాగిందన్నారు.

Also Read:తెలంగాణ దిక్సూచి..జయశంకర్ సార్

రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, పదేళ్ల ప్రగతి పాలనను తన ఆశయాలకు అనుగుణంగా సాగించి, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపామని కేసీఆర్ తెలిపారు.ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేస్తూ, వారి స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా మాత్రమే వారికి మనం అందించే ఘన నివాళి అని కేసీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -