జిల్లాల్లో ఏం ఉండాలో తేల్చండి…

214
Online News Portal
KCR on new districts
- Advertisement -

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తయినందున అధికారులు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి పెట్టాలని సిఎం ఆదేశించారు. జిల్లాల్లో పరిపాలనా విభాగాలు సమర్థంగా పనిచేసే విధానం రూపకల్పనపై క్యాంపు కార్యాలయంలో సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.

ఈ సంధర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రతీ జిల్లాలో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఉండాల్సిన విభాగాలు నిర్ణయించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తరుపున విధిగా ఏమేమి ఉండాలనే విషయంపై ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతీ జిల్లాలో ఖచ్చితంగా నిర్వహించే విభాగాలు గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని సిఎం చెప్పారు. ప్రతీ జిల్లాలో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రం ఉండాలని, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లా యూనిట్ గా ఏమి సాధించుకోవచ్చో ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. జిల్లా యూనిట్ గా అమలు చేసే పధకాలను కూడా గుర్తించాలని చెప్పారు.

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపిలు కె. కేశవరావు, జితేందర్ రెడ్డి, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, సీనియర్ అదికారులు ఎస్. నర్సింగ్ రావు, శాంత కుమారి, బి.పి. ఆచార్య, జనార్థన్ రెడ్డి, వాకాటి కరుణ, సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -