తమ ప్రభుత్వం పూర్తి ప్రజాస్వామ్య బద్ధంగా ఉందన్నారు సీఎం కేసీఆర్.పరిమితికి లోబడి ఆందోళన చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పాదయాత్రలు,బస్సుయాత్రలు చేస్తే అడ్డుకున్నామా అని ప్రశ్నించారు. ట్యాంక్‌బండ్‌పై ధర్నాలు,నిరసనలు నిషేధించామని తెలిపారు.
అనుమతి లేకున్నా ధర్నాలు, నిరసనలు చేస్తామనడం సరికాదన్నారు. నిరసనకారుల పట్ల కఠినంగానే ఉంటామన్న సీఎం నిషేధాజ్ఞలు మేము తీసుకురాలేదని చంద్రబాబు హయాంలో వచ్చినవేనని తెలిపారు. పోలీసులు కొన్ని ధర్నాలకు అనుమతులు ఇవ్వరని…అల్లర్లు సృష్టించడం కోసమే ధర్నాలు చేయడం భావ్యం కాదన్నారు.
అనుమతి లేకున్నా, కోర్టు వద్దన్నా ధర్నాలు చేస్తామంటే అనుమతించామని గుర్తుచేశారు సీఎం. ధర్నాలు నిర్వహించుకునేందుకు సరూర్‌నగర్‌లో అవకాశం ఇచ్చామని…లేదా తాము కోరినచోటే చేస్తామంటే అనుమతిచ్చే ప్రసక్తే లేదన్నారు. మంచి పద్ధతిలో ధర్నాలు, ర్యాలీలు చేయాలని సూచించారు.