బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

16
- Advertisement -

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్   తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు.

మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఖానాపూర్ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి…పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ఆదుకోవాలి… క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలి. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలి అన్నారు.

Also Read:

 

- Advertisement -