24 గంటల కరెంట్ ఇవ్వలేదా?: కేసీఆర్

8
- Advertisement -

తమ ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంట్ ఇవ్వలేదా చెప్పాలన్నారు మాజీ సీఎం కేసీఆర్. వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. 1969లో మూగ‌బోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జోవం పోసింది ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుర్తు చేశారు.

చీక‌ట్ల‌ను పార‌దోల‌డానిక ప్ర‌జ‌ల్లో ఆత్మ‌విశ్వాసం పెంపొందించ‌డానికి ఒక మాట చెప్పాను. ఉద్య‌మం నుంచి వెన‌క్కి మ‌ళ్లితే, ఉద్య‌మ జెండాను దించితే రాళ్ల‌తో కొట్టి చంపాండ‌ని అని చెప్పి ఉద్య‌మాన్ని ప్రారంభించాను అని తెలిపారు కేసీఆర్. 60 ఏండ్ల స‌మైక్య పాల‌న‌లో ఎంతో వేద‌న, హింస, అణిచివేత చూశాం.. అంద‌రికీ బాగా తెలుసు. గోదావ‌రి, కృష్ణా నీళ్లు ద‌క్క‌క‌కుండా త‌ర‌లిపోతే త‌ల్లి చ‌నుబాల‌కు నోచ‌ని పిల్ల‌లాగా తెలంగాణ బిడ్డ‌లు రోదించారు అన్నారు.

కురువు, కాట‌కాల‌కు గుర‌య్యారు. పాములు, తేళ్లు కుట్టి అనాథాల్లాగా చ‌నిపోయారు అని తెలిపారు. ప్ర‌జ‌లు ప‌రిపాల‌న అప్ప‌గిస్తే విధ్వంస‌మైన తెలంగాణ‌ను వికాసం వైపు న‌డిపించాను. కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ ఆశ్ర‌య‌మిస్తే.. ఏప్రిల్ 27, 2001న జ‌ల‌దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చ‌రిత్ర‌ను మలుపుతిప్పిన మ‌హోజ్వ‌ల‌ ఘ‌ట్టం. కులం, మ‌తం, ప‌ద‌వుల కోసం పుట్ట‌లేదు.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు.

Also Read:తెలంగాణ సీఎస్‌గా కే రామకృష్ణారావు

- Advertisement -