22న..కేశవ చంద్ర రమావత్(కెసిఆర్) రిలీజ్

1
- Advertisement -

రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్), గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొందింది. ఇటివలే రిలీజ్ అయిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ‘కేశవ చంద్ర రమావత్’ మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈనెల 22న సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ని ‘బలగం’తో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కమెడియన్, దర్శకుడు వేణు లాంచ్ చేశారు. ‘టీం వీరందరికీ ఆల్ ద బెస్ట్. ఇది మరో బలగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చెప్పారు వేణు.

‘సినిమాను తెలంగాణ ఆంధ్ర రిలీజ్ చేస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ గారికి (దీప ఆర్ట్స్) జోర్దార్ సుజాత రాకేష్ దంపతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వరల్డ్ వైడ్ గా అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమాని రిలీజ్ అవుతున్న ఈ చిత్రం అద్భుత ఘనవిజయం సాధిస్తుందని దర్శకుడు అంజి పేర్కొన్నారు.

ఈ చిత్రంలో జోర్దార్ సుజాత, ధనరాజ్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, కృష్ణ భగవాన్, రవి రచ్చ, మై మధు, లోహిత్ కుమార్ ఇతర కీలక పాత్ర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తెలంగాణ మాస్ట్రో ‘చరణ్ అర్జున్’ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read:గురుకులాల్లో బర్త్ డే వేడుకలా?

నటీనటులు : రాకింగ్ రాకేష్, అన్నన్య కృష్ణన్, తనికెళ్ల భరణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత, లోహిత్ కుమార్, బలగం మైమ్ మధు, రచ్చ రవి, కృష్ణ భగవాన్, అంజి, సాయి చరణ్ కిష్టప్ప, జబర్దస్త్ ప్రవీణ్, జబర్దస్త్ నవీన్, జబర్దస్ రాజ్ రాజ్, జబర్దస్త్ జబర్దస్త్ , కీర్తి లత, బలగం తాత, జబర్దస్త్ కర్తానందం

- Advertisement -