కెసిఆర్ సినిమా… బ్లాక్ బస్టర్

7
- Advertisement -

రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటించిన ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్). గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటించింది. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొని ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

సక్సెస్ మీట్ లో హీరో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఆలోచనని ఓ మిత్రుడికి చెప్పినప్పుడు తను ఇచ్చిన సమాధానం, నాకు ఎదురైన బాధ, అవమానం నన్ను ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనైనా చేయాలనే కసి రేకెత్తించింది. ఒక కసితో ఈ సినిమా చేశాను. ఈ సినిమా చేయడానికి కారణం రాఘవన్న పుష్ప వదిన వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా భార్య సుజాత కారణంగానే నేను ఈరోజు ఈ వేదికపై ఉన్నాను. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. చరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ అంజి అన్న నన్ను తలెత్తుకునేలా చేసే సినిమా తీశారు. ఈ నెలలోనే మరో సినిమాని ప్రకటించబోతున్నాను. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాతో రెండేళ్ల పాటు జర్నీ చేశాను. ఈ సినిమా ఆహాలో ప్రసారమవుతుంది. అక్కడినుంచి మరింత అద్భుతంగా ఈ సినిమా జర్నీ కొనసాగుతుంది. ఈ సినిమాకి ఖచ్చితంగా అవార్డ్స్ వస్తాయి. గొప్ప పండగ చేసుకుంటాం. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇదే టీం మరో మంచి సినిమాతో మీ ముందుకు వస్తాం. మీ అందరి ఆశీర్వాదంతో డెఫినెట్ గా మరో హిట్ కొడతాం. థాంక్యూ’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ఫాన్స్ విజువల్స్ వేస్తూ థియేటర్లో పేపర్లు ఎగరేసే మాస్ సినిమా చేయాలనే కోరిక నాకు ఉండేది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. సంధ్యా థియేటర్లో ఈ సినిమా చూసినప్పుడు ఫ్యాన్స్ రెస్పాన్స్ మర్చిపోలేను. ఇలాంటి మంచి సినిమాని నాకు ఇచ్చిన రాకేష్ కి థాంక్యూ సో మచ్. కెసిఆర్ పేరు రాగానే రాకేష్ చేసిన పర్ఫార్మెన్స్ కి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ఈ సినిమాకి నేనే మ్యూజిక్ చేయాలని రాకేష్ మా స్టూడియో కి వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు నుంచి ఇది నా సినిమాగా పని చేశాను. రాకేష్ నాకు మా తమ్ముడు రూపంలో కనిపించాడు. నా తమ్ముడు సినిమాకి పనిచేస్తే ఎలా చేస్తానో ఈ సినిమాకి ఎలా చేశాను . ఈ సినిమా నాకు ఊహించినదానికంటే ఎక్కువ పేరు తీసుకొచ్చింది. రాకేశ్ నా జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని హిట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.

డైరెక్టర్ గరుడవేగ అంజి మాట్లాడుతూ… ఈ సినిమాని ఘనవిజయం చేసిన ఆడియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాను. ఈ సినిమాని రిలీజ్ చేసిన దీపా ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు. ఆయన లేకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యేది కాదు. రాకేష్ నిర్మాతగా యాక్టర్ గా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇలాంటి చిన్న సినిమా మూడు వారాలు ఆడి నాలుగు వారంలో కడుగు పెట్టడమంటే మామూలు విషయం కాదు. ఆహా లాంటి సంస్థ సినిమా నచ్చి తీసుకోవడం చాలా అభినందనీయం. అందరికీ ధన్యవాదాలు. చరణ్ అర్జున్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. ఆయన మ్యూజిక్ లేకపోతే సినిమా ఈ రేంజ్ కి వచ్చేది కాదు. మధు చాలా అద్భుతంగా ఎడిట్ చేశాడు. ఈ సినిమాల నటించే పెర్ఫాం చేశారు నా ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అన్నారు

ఆహా అక్విజిషన్స్ హెడ్ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ.. రాకింగ్ రాకేష్ గారు కామెడీ షోస్ లో చిన్న పిల్లల్ని తీసుకుని సరదాగా నవ్విస్తారని అనుకున్నాను కానీ ఈ సినిమా చూసిన తర్వాత పెద్దవాళ్లని కూడా ఏడిపిస్తారని తెలుసుకున్నాను. 35, మసూద, ప్రేమలి ఈ సినిమాలకి ఎంత మంచి పేరు వచ్చిందో ఈ సినిమాతో ఆహా కి అంత మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలో పార్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు కూడా అంత గొప్పగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.

యాక్టర్ లోహిత్ కుమార్, రమేష్, మైమ్ మధు, రచ్చ రవితో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

Also Read:Look Back 2024:ఈ హీరోలకు అస్సలు కలిసిరాలేదు!

- Advertisement -