తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన అధికారిక నివాసంలోకి గురువారం ఉదయం 5గంటల 22నిమిషాలకు గృహప్రవేశం చేశారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి ‘ప్రగతిభవన్’గా నామకరణం చేశారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో చినజీయర్‌స్వామి పాల్గొన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం నివాసం, సమావేశం మందిరం,క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. సమావేశ మందిరానికి ‘జనహిత’గానామకరణం చేశారు.
గృహ ప్రవేశంలో భాగంగా దైవప్రవేశం, యతి ప్రవేశం, గో ప్రవేశం, నివసించే వారి ప్రవేశంను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే నూతన అధికారిక నివాస భవనాన్ని నిర్మించారు. రూ. 38 కోట్ల వ్యయంతో మూడు బ్లాకులుగా ఐదు భవనాల నిర్మాణం జరిగింది. ఈ భవనాల సముదాయానికి ప్రగతిభవన్‌గా నామకరణం చేశారు. వీటిలో వివిధ వర్గాలతో భేటీ అయ్యే సమావేశ మందిరానికి జనహిత పేరును పెట్టారు. దాదాపు వెయ్యి మందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ నిర్మాణం జరిగింది. ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలను నాటారు.