- Advertisement -
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటు సమావేశం కొనసాగినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ప్రాజెక్టులు, రాజకీయాంశాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం సమావేశమైన సంగతి తెలిసిందే.
- Advertisement -