ఎస్టీల విద్యుత్ బకాయిలు రద్దు-కేసీఆర్‌

224
- Advertisement -

ఎస్టీల విద్యుత్ బకాయిలు, విద్యుత్ కేసులన్నీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి, ఎంపీలు సీతారాం నాయక్, నగేశ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్… ఎస్టీలకు కూడా గొర్రెల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తామన్నారు.

KCR meeting with the Electricity officials at Pragati Bhavan

రూ. 70 కోట్లకుపైగా ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేయాలని నిర్ణయించామని… 40 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాలని సీఎం ఆదేశించారు. మిగితా రూ. 30 కోట్లను ట్రాన్స్‌కో మాఫీ చేస్తుందని జెన్‌కో – ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. ఎస్టీలపై పెట్టిన విజిలెన్స్ కేసులు ఎత్తివేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతీ ఎస్టీ ఇంటికి రూ. 125 మాత్రమే తీసుకొని కరెంటు కనెక్షన్ ఇవ్వాలని… ప్రతీ ఇంటికి సర్వీస్ వైరు, వైరింగ్, రెండు లైట్లు ఏర్పాటు చేయాలని… 50 యూనిట్ల లోపు కరెంటు వాడుకునేవారికి ఎలాంటి ఛార్జీ తీసుకోకూడ‌ద‌ని సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. ఎస్టీ ఆవాస ప్రాంతాలకు త్రీఫేజ్ కరెంటు అందించాలని సీఎం ఆదేశించారు.

KCR meeting with the Electricity officials at Pragati Bhavan

రాష్ట్రంలోని అన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాలకు, ప్రతీ ఎస్టీ ఇంటికి, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఉన్న వాటితో సహా ప్రతీ ఎస్టీ వ్యవసాయ దారుడికి విద్యుత్ కనెక్షన్ కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ ఎస్టీ ఆవాస ప్రాంతానికి రోడ్డు వేసేందుకు వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పి స్థానికులకే ప్రవేశం కల్పించే విధానం అమల్లోకి తెస్తామని సీఎం వెల్లడించారు.

- Advertisement -