సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ తగిలిందన్నారు మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన హరీశ్… పోడుభూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ వచ్చిందన్నారు. కీలక నిర్ణయాల వల్ల ప్రతిపక్షాలకు ఏంమాట్లాడాలో తెలియడం లేదని… బయటే కాదు అసెంబ్లీలో కూడా విపక్షాలను సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు.
నల్లగొండ జిల్లాలో రాజకీయ వరదలు వస్తాయని… అన్ని నియోజకవర్గాల్లో కొత్త, పాత వరదలు కలుస్తాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీల వద్ద డబుల్ బెడ్ రూమ్ అంశం తప్ప మరో అంశం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తర్వాత గ్రాఫ్ పెరిగిందని చెప్పారు.
Also Read:ఆ హీరోయిన్ని ఎలా తప్పు పట్టగలం?