అలాంటి వారికి.. కేసీ‌ఆర్ మాస్ వార్నింగ్!

38
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల సంగ్రామనికి బి‌ఆర్‌ఎస్ తెరతీసింది. అన్నీ పార్టీలకంటే ముందే అభ్యర్థులను ప్రకటించి రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచింది. సర్వేల ఆధారంగా ప్రజామెప్పు ఉన్నవారికే టికెట్లు అని మొదటి నుంచి చెప్పినట్లుగానే కేటాయింపు జరిపారు అధినేత కే‌సి‌ఆర్. 119 స్థానాలకు గాను 115 స్థానాల అభ్యర్థులను ప్రకటించి అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అధిక ప్రదాన్యం కల్పించారు. అయితే ఓ ఏడు స్థానాల్లో మాత్రం అభ్యర్థుల మార్పు తప్పదని చెప్పుకొచ్చారు కే‌సి‌ఆర్ కాగా టికెట్ తమకే వస్తుందని ఆశించిన కొంతమంది నేతలను అధినేత నిరభ్యంతరంగా పక్కన పెట్టడం గమనార్హం..

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వంటి వారికి టికెట్ లభించలేదు. దాంతో వీరిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలను ఉద్దేశించి కే‌సి‌ఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అర్హత కలిగిన ప్రతిఒక్కరికి సీటు లభించిందని అర్హత ఉండి సీటు దక్కని వారికి ఇతరత్రా పదవులతో ప్రదాన్యం కల్పిస్తామని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు ఎంత పెద్దవారైనా వారిని పార్టీ నుంచి తీసిపారేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు అధినేత. పార్టీ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. కొందరు నేతల్లో అసమ్మతి ఉండడం సహజం అని అవన్నీ క్రమంగా సర్ధుకుంటాయని ఆయన అన్నారు. దీంతో సీటు దక్కని వారు పార్టీకి సంబంధించి ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:హరీష్‌కు అండగా ఉందాం:KTR ట్వీట్

- Advertisement -