కాంగ్రెస్ వైఖరిని నిలదీయండి: కేసీఆర్

29
- Advertisement -

బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలి అన్నారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి అని.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలి అన్నారు. బీఆర్‌ఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పికొట్టాలి… రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు.. ఎండిన పంటలు, అందని కరెంట్, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరతపై అసెంబ్లీలో, మండలిలో పోరాడాలి అన్నారు.

బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి.. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై మాట్లాడాలి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ డీఏ, పీఆర్సీ అమలుపై అసెంబ్లీ, మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలి అని… మహిళలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కొట్లాడాలి అన్నారు.

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలి… విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల విడుదలపై, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలపై పోరాడాలి అన్నారు. దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.. గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలుకు సంబంధించి అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బీఆర్‌ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఎల్పీ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ప్రజల పక్షంగా గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. సభల్లో ప్రజా సమస్యలపై మరింత ప్రతిభావంతంగా పోరాడేందుకు సభ్యులను సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత అధ్యక్షతన జరిగిన ఎల్పీ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా శాసనసభ, శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు.

Also Read:గద్దర్ సినీ అవార్డులు.. ఎంట్రీల ఆహ్వానం

- Advertisement -