- Advertisement -
విభూది ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గ్రీన్ ట్రి ప్రొడక్షన్స్ ద్వారా ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేశవ చంద్ర రమావత్. గరుడవేగ అంజి సినిమాటోగ్రఫీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్ ప్రధాన పాత్రలుగా తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత, తనికెళ్ల భరణి ధనరాజ్, మైమ్ మధు తదితరులు కీలకపాత్రలో పోషించారు.
నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా డిసెంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
Also Read:అక్రమ అరెస్ట్‌లు..ఏడో గ్యారెంటీనా?: కేటీఆర్
- Advertisement -