కాంగ్రెస్‌ వైపు జగన్‌,టీఆర్ఎస్ చూపు..!

348
kcr jagan

2019 దేశ రాజకీయాల్లో కొత్త మలుపుకు శ్రీకారం చుట్టబోతోంది. రాజకీయ ప్రత్యర్థులందరూ ఒకే చోట చేరేందుకు వేదిక కానుంది. బీజేపీ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రాంతీయ పార్టీలు ఇందుకోసం తమ వైరాన్ని దూరం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇక యూపీఏ 3లో ప్రధానాపత్ర పోషిస్తున్న చంద్రబాబు అవసరమైతే వైసీపీ,టీఆర్ఎస్‌ల మద్దతు కూడగట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. తాను ప్రధాని పదవికి రేసులో లేనని చెప్పడం ద్వారా టీఆర్ఎస్,వైసీపీ కూడా కూటమి వైపు రావడానికి ద్వారాలు తెరిచారు.

చంద్రబాబు ప్రధాని కాకపోతే కేసీఆర్,జగన్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. అందుకే ప్రధాని పదవిపై తనకు ఆశలేదని స్పష్టమైన ప్రకటన చేసి, వారిని కాంగ్రెసుకు దగ్గర చేసే వ్యూహాన్ని అనుసరించారు.ఈ నేపథ్యంలో కేసీఆర్…అవసరమైతే యూపీఏకు మద్దతిచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి మద్దతు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండి ప్రత్యేక హెదా ఇస్తామంటే జగన్‌ వారికి మద్దతిచ్చేందుకు వెనుకాడే పరిస్ధితి కనిపించడం లేదు. ప్రాంతీయ పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే టీఆర్ఎస్,వైసీపీ బయటి నుండి కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఎన్నికల ఫలితాలకు ముందు దేశరాజకీయాల్లో పెనుమార్పులు సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది.