తెలంగాణ జాతి పిత కేసీఆరే: కౌశిక్ రెడ్డి

17
- Advertisement -

తెలంగాణ జాతిపిత కేసీఆరే అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నిన్న స్టేషన్ ఘన్ పూర్ లో సిఎం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు..నిసుగ్గుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాను అని అబద్ధాలు చెబుతున్నాడు అన్నారు. దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రావాలి..జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు..డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు..మరి ఎందుకు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు అన్నారు.

కేసీఆర్ 2 లక్షల 10 వేల ఉద్యోగాలు ఇచ్చాడు.. మీరు వెంటనే జాబ్ కేలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కేటీఆర్ దిగిపోగానే రైతు బంధు ఎందుకు బంద్ అయ్యిందో సమాధానం చెప్పాలి.. కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డి ది కాదు అన్నారు.

హరీష్ రావు, కేటీఆర్ స్థాయి కూడా రేవంత్ రెడ్డి ది కాదు.. కేవలం కౌశిక్ రెడ్డి స్థాయి నీదని గుర్తు చేస్తున్న రేవంత్ రెడ్డి..ఆరు గ్యారెంటీలు ఏమైనవి రేవంత్ రెడ్డి..రైతు రుణ మాఫీ అయ్యిందని బట్టి విక్రమార్క అంటున్నాడు..నా నియోజకవర్గం లో వచ్చి 100 శాతం రుణ మాఫీ అయినట్లు చూపిస్తే నేను రాజీనామా చేస్తా..ముఖ్యమంత్రి హోదా లో మాట్లాడు రేవంత్ రెడ్డి..జర్నలిస్టులను బెదిరిస్తున్నాడూ రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read:KTR:20న సూర్యాపేటలో.. 23న కరీంనగర్‌లో బీఆర్ఎస్ సమావేశం

బట్టలు ఉదగొట్టి ఏం చేస్తావ్.. బట్టలు ఉడగొట్టి ఏం చేస్తావ్.. జవాబు చెప్పాలి..ప్రజలు ఎదురు చూస్తున్నారు నీ సమాధానానికి రేవంత్ రెడ్డి..స్టేషన్ గన్ పూర్ లో అభివృద్ధి కోసం పార్టీ మారినా అని కడియం అంటున్నాడు..మరి ఎంపీ గా ఉన్న కడియం కూతురు అభివృద్ధి కోసం బీజేపీ లోకి ఎందుకు మారలేదు..చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించింది కేసీఆర్ అన్నారు.

- Advertisement -