అది మహాకూటమి కాదు.. మాయ కూటమి

227
ministerktr telangana bhavan
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలకు స్థానం లేదని, టీడీపీ పార్టీ తెలంగాణలో పూర్తిగా చచ్చిపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వారికి గులాబీ కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ మాయకూటమి రూపంలో మహాకూటమి ప్రజలను మరోసారి మోసం చేయడానికే వస్తుందని, ప్రజలు ఆలోచించించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీ పార్టీని స్థాపిస్తే సిగ్గులేకుండా చంద్రబాబు అదే కాంగ్రెస్‌ తో పొత్తుపెట్టుకున్నాడని చంద్రబాబుపై తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అజేయ శక్తిగా ఎదిగిందని, ఎన్ని కూటములు వచ్చినా టీఆర్‌ఎస్‌ను ఏమి చేయలేవని, ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కే పట్టకట్టబోతున్నారని, ఈ విషయం ఇటీవల ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో మరోసారి స్పష్టమైందని, సర్వేల ప్రకారం టీఆర్‌ఎస్ మరోసారి తెలంగాణలో విజయ ఢంకా మోగించి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని, తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీలను ప్రజలు బొంద పెట్టి టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజానీకం తమనే ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

60 రోజులు మాకోసం కష్టపడితే 60 నెలలు మీకోసం పనిచేస్తామని,  తలాపున కృష్ణా పారుతున్నా తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్య్తక్తం చేశారు మంత్రి కేటీఆర్‌. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పాపం ఎవరిదో మీకే బాగా తెలుసు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు మిషన్ భగీరథ చేపట్టాం.. తెలంగాణలో ఉన్న ప్రతీ ఒక్కరు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్‌. రైతుకు 8 వేల పెట్టుబడి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని, మరోసారి అవకాశమిస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -