కేసీఆరే మా నాయకుడు అని తేల్చిచెప్పారు ఎమ్మెల్సీ కవిత. మీడియాతో మాట్లాడిన ఆమె.. కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతాం అన్నారు. సీఆర్ మా దేవుడు. ఆయన నాయకత్వమే తెలంగాణకు రక్ష. వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ఎజెండా లేదు అన్నారు.
పార్టీలో ఎలాంటి గందరగోళమూ లేదని నొక్కి చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు. రెండు వారాల క్రితం కేసీఆర్‌కు లేఖ రాసిన. గతంలోనూ పలుమార్లు నా అభిప్రాయాలను లేఖ ద్వారా చెప్పిన. అయితే కేసీఆర్‌కు అంతర్గతంగా రాసిన ఉత్తరం బహిర్గతమైంది అన్నారు.
పార్టీలోని అన్ని స్థాయుల్లో అనుకుంటున్న విషయాలనే ప్రస్తావించిన అని కవిత వివరించారు. ఇటీవలి కాలంలో తెలంగాణలోని సగం ప్రాంతాన్ని చుట్టివచ్చానని, గ్రౌండ్‌లెవల్‌లో అనుకుంటున్న విషయాలనే చెప్పానని, ఇందులో తన వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని స్పష్టంచేశారు.నాకు ఎవరిపైనా ప్రేమా లేదు, ద్వేషమూ లేదు. పార్టీలోని లోపాలను చర్చించుకొని, సవరించుకుంటూపోతే పార్టీ పదికాలాలపాటు చల్లగా ఉంటుందనేది నా భావన. నేను రాసిన లేఖ బయటకు రావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కోతికి కొబ్బరిచిప్ప దొరికిన చందంగా సంబురపడుతున్నయి అన్నారు.
Also Read:తెలంగాణలో కరోనా కలకలం..

