నాన్నే…నా రోల్ మాడల్: కేటీఆర్

374
kcr ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్ 42వ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. సినీ,రాజకీయాలకు అతీతంగా రామన్నకు బర్త్ డే విషెస్ తెలిపారు. కేటీఆర్ బర్త్ డే విషెస్‌తో ట్విట్టర్‌ మార్మోగిపోయింది. హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేస్తూ నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఇటీవలె మంత్రిగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిట్ చాట్‌లో మాట్లాడిన కేటీఆర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నా రోల్ మాడల్ నాన్న కేసీఆర్‌ అని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్‌ టాస్క్‌మాస్టర్ అని, మంత్రి హరీశ్‌రావు హార్డ్‌వర్కర్ అని కొనియాడారు .మంత్రి హరీశ్‌రావు మొండిపట్టుదల కలిగిన, కష్టపడి పనిచేసే నాయకుడని కితాబిచ్చారు.

Image result for ktr kcr

మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరన్న ప్రశ్నకు సమాధానంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అని చెప్పారు. ఇష్టమైన క్రికెటర్లలో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు.

ఏపీలో ఎవరికి ఓటు వేస్తారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా… తనకు ఏపీలో ఓటు లేదని, అందువల్ల తన ఓటు టీడీపీకా లేక వైసీపీకా? అనే విషయాన్ని చెప్పలేనని సమాధానమిచ్చారు.పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌ను ప్రజలే నిర్ణయిస్తారని… దానిని డిసైడ్ చేయడానికి నేనెవరిని’ అంటూ సమాధానం ఇచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్‌ని ‘పెర్ఫామర్’, మహేష్‌బాబుని ‘స్ర్కీన్ ప్రజన్స్‌లో సూపర్‌స్టార్’, ప్రభాస్‌ని ‘బాహుబలి’ , పవన్ కల్యాణ్‌ని ‘ఎనిగ్మా’ అని అన్నారు కేటీఆర్‌. సమంత గురించి చెబుతూ.. మా తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్. నిజంగా సున్నితమైన మనస్కురాలు’ అంటూ బదులిచ్చారు.

 ktr kcr

- Advertisement -