ప్రధానితో కేసీఆర్ భేటీ..

201
- Advertisement -

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో భేటి అయ్యారు. 7 రేస్‌కోర్స్ రోడ్‌లోని ప్రధాని నివాసంలో వీరి సమావేశం ముగిసింది. పై సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల అమలు మొదలుకొని నిన్న మొన్నటి బీసీ-ఈ రిజర్వేషన్ల దాకా అనేక కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది.

modi kcr

సీఎం ప్రధానంగా బీసీ-ఈ గ్రూపు రిజర్వేషన్ల పెంపు బిల్లు, వ్యవసాయానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తింపు, అసెంబ్లీ సీట్ల పెంపు, రిజర్వేషన్ల విషయంలో రాష్ర్టాలకు స్వేచ్ఛ, ఎస్సీ వర్గీకరణ, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలు, హైకోర్టు విభజన తదితర అంశాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. వీటితోపాటు ప్రధాని ప్రస్తావించిన ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు అంశం, నోట్ల రద్దు అనంతర పరిణామాలు తదితర జాతీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రకటించారు. రూ. 17 వేల కోట్ల రుణమాఫీ ద్వారా 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని క్రాప్‌కాలనీలుగా మార్చాలన్నారు.

- Advertisement -