అనుదీప్…యువతకు ఆదర్శం:కేసీఆర్

266
kcr anudeep
- Advertisement -

ప్రతిష్టాత్మక సివిల్స్ – 2017 ఫలితాల్లో టాప్ ర్యాంకు సాధించిన తెలంగాణ తేజం దురిశెట్టి అనుదీప్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారు. ప్రగతి భవన్‌లో తల్లిదండ్రులతో కలిసి సీఎంను కలిసిన అనుదీప్‌ని ముఖ్యమంత్రి అభినందించారు. యువతకు అనుదీప్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్దితో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారనడానికి అనుదీప్ నిదర్శనమని సీఎం అన్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి అనుదీప్‌ ఫ్యామిలీ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా అనుదీప్ తల్లిదండ్రులు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

2013 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన అనుదీప్‌ది జగిత్యాల జిల్లా మెట్ పల్లి వాసి. సివిల్స్ టాపర్‌గా నిలిచి తెలంగాణ సత్తాచాటారు. ఐఆర్‌ఎస్ ట్రెయినీ బ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సెంట్రల్‌ కస్టమ్స్‌ జీఎస్పీలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 2011లో బిట్స్ పిలానీ, రాజస్థాన్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీటెక్ చేశారు.

kcr anudeep

అనుదీప్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. శీలం సాయితేజ (43వ ర్యాంకు), అమిలినేని భార్గవ్ తేజ 88వ ర్యాంకు,నారపురెడ్డి మౌర్య (100వ ర్యాంకు), జి.మాధురి (144వ ర్యాంకు), వివేక్ జాన్సన్ (195వ ర్యాంకు), ఎడవల్లి అక్షయ కుమార్ (624వ ర్యాంకు), భార్గవ శేఖర్ ( 816వ ర్యాంకు),సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ 196వ ర్యాంకు సాధించారు.

- Advertisement -