సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఇదే..!

215
cm kcr
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో మరింత దూకుడు పెంచింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తుండగా మరోవైపు గలాబీ బాస్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 19 నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. 19న నిజామాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం క్షేత్రస్ధాయిలో సన్నాహాలు చేస్తున్నారు. నిజామాబాద్‌తో పాటు అన్నిపార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ మీటింగ్స్ ఉండేలా షెడ్యూల్ చేస్తున్నారు గులాబీ నేతలు.త్వరలోనే కేసీఆర్ టూర్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని 17 ఎంపీ స్ధానాలను క్లీన్ స్వీప్ చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది టీఆర్ఎస్‌ . ఓవైపు పార్టీ శ్రేణుల్లో కేటీఆర్ ఉత్సాహం నింపుతుండగా.. ఇక కేసీఆర్ ప్రచారానికి వస్తే టీఆర్ఎస్‌కు మరింత మెజార్టీ తెచ్చిపెడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుండగా అదేరోజు నుండి మార్చి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 26న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 28 వరకు ఉంటుంది. ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.

- Advertisement -