KCR:రైతు కుటుంబానికి కేసీఆర్ సాయం..

21
- Advertisement -

పొలం ఎండిపోయింది, కొడుకు పెళ్లి ఉందని తమ బాధలు చెప్పుకున్న కుటుంబానికి రూ. 5 లక్షలు ఆర్ధిక సాయం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నీళ్లు అందక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు.

ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువు రైతులను కేసీఆర్ పరామర్శించారు. దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయిన ఆంగోతు సత్తెమ్మ కేసీఆర్ ముందు తన గోడువెల్ల బోసుకుంది.

బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు నాలుగైదు లక్షల అప్పు అయిందని కేసీఆర్ ముందు విలపించారు. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని పంట ఎండిపోవడంతో చేతిలో చెల్లి గవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవడంతో తక్షణమే స్పందించిన కేసీఆర్ సత్యమ్మ కుమారుని వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయలను అక్కడికక్కడే ప్రకటించారు.రైతులు ధైర్యంగా ఉండాలని పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామని.. 24 గంటల కరెంటును సాధించుకుందామని.. రైతు రుణమాఫీని, రైతు బంధు పోరాడి సాధించుకుందామని భరోసా ఇచ్చారు.

Also Read:IPL 2024:ఎస్‌ఆర్‌హెచ్ దూకుడు అగేనా?

- Advertisement -