సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) లో డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి పొందిన లాభాల్లో 23 శాతాన్ని కార్మికులకు వాటాగా చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వచ్చంద పదవీ విరమణ పధకం (విఆర్ఎస్) ద్వారా లబ్ది పొందని వారికి కూడా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని సిఎం చెప్పారు.
సింగరేణి బొగ్గు (3) కార్మికుల సంఘం గౌరవ అధ్యకురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతానికి చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘం నాయకులు గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు, బోనస్, లాభాల్లో వాటా తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ చీస్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ నల్లాల ఓదేలు, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎంపిలు బి. వినోద్, బాల్క సుమన్, సీతారాం నాయక్, మాజీ ఎంపి జి.వివేక్, ఎమ్మెల్యేలు కనకయ్య, దివాకర్ బాబు, దుర్గం చిన్నయ్య, టిబిజికెఎస్ నాయకులు వెంకట్రావు, కింగర్ల మల్లయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులు. దినదిన గండంగా విధులు నిర్వహిస్తూ జాతి సంపద సృష్టిస్తున్న గని కార్మికులు సమానమేనని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. సైనికుల పట్ల ఎంత గౌరవభావం కలిగి ఉంటామో కార్మికుల పట్ల కూడా అంతే సహృదయత ప్రదర్పించాలని సిఎం చెప్పారు. ఎన్నో ఏళ్ల పాటు గనుల్లో బొగ్గును వెలికితీసి అనారోగ్యం పాలైన కార్మికుల కుటుంబ సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఏళ్ల తరబడి వారు చేసిన సేవలకు గుర్తింపుగా వారు కోరిన వారికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం అత్యంత మానవత్వంతో వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు.
సింగరేణిలో 1998లో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియను రద్దు చేసింది. నాటి నుంచి సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే డిపెండెంట్ ఉద్యోగాలు వస్తాయని, తమ బతుకులు బాగుపడతాయని కార్మికులు ఆశించారు. దాని ప్రకారం సింగరేణి ఉద్యోగులు, కార్మికులు, ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి డిపెండెంట్ ఉద్యోగాల విషయాన్ని విన్నవించారు. ఈ నేపధ్యంలోను గురువారం క్యాంపు కార్యాలయంలో సిఎం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సింగరేణిలో పనిచేసి గాయపడినా, అనారోగ్యం పాలయిన, పదవీ విరమణ చేసిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని సిఎం నిర్ణయించారు. దసరా కానుకగా వారికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు, డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.
సింగరేణికి పెరిగిన లాభాలు – లాభాల్లో 23 శాతం
2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ రూ.1066.13 కోట్ల నికర లాభం పొందింది. ఇందులో 23 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని సిఎం ఆదేశించారు. దీని ప్రకారం కార్మికులకు రూ. 245.21 కోట్ల లాభం పంచిపెడతారు. దీని ప్రకారం ఒక్కో కార్మికుడికి సగటున రూ.43,078 అందుతాయి. సింగరేణిలో కార్మికులకు లాభాల్లో 23 శాతం వాటా వాటా ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాది కూడా క్రేసీఆర్ ప్రభుత్వం కార్మికులకు 21 శాతం వాటా ఇచ్చింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కార్మికులకు గరిష్టంగా 2012-13 లో 18 శాతం వాటా మాత్రమే ఇచ్చారు. ఇవి కాక సింగరేణి సంస్థ దీపావళి బోనస్ కింద రూ.54 మేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రెండు నిర్ణయాలతో సింగరేణి కార్మికుడికి ఇదే నెలలో ఒక్కొక్కరికి రూ. 97 వేలకు పైగా నగదు అందుతాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేయడమే కాకుండా, అత్యధిక లాభాన్ని గడించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి ఈ సారి 60 మిలియస్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. దీని ద్వారా రూ. 1313 కోట్ల స్థూల ఆదాయం, రూ.1066 కోట్ల నికర లాభం పొందింది. చరిత్రలో ఇంత పెద్ద పెద్దంలో బొగ్గు ఉత్పత్తి జరగడం, ఆదాయం గడించడం మొదటి సారి. గతంలో 2012లో గరిష్టంగా 53 మెట్రిక్ టన్నులు, 2014-15లో గరిష్టంగా రూ.490 కోట్ల ఆదాయం పొందింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో గరిష్టంగా 2013-14లో రూ.418 కోట్లు ఆదాయం రాబట్టింది.
తెలంగాణ శక్తిని నిరూపించారు
తెలంగాణ ప్రజలకు పాలన చేతకాదు, నిర్వహణ చేతకాదు అని విమర్శించిన వారి నోళ్లు మూయించేలా తెలంగాణలో పాలన సాగుతున్నదని ముఖ్యమంత్రి క్రేసీఆర్ అన్నారు. అందుకు సింగరేణి పొందిన లాభాలో ఓ ఉదాహరణ అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో బొగ్గు ఉత్పత్తి చేయలేదని, ఇంత లాభం గడించలేదని, ఇంత ఎక్కువ బోనస్ కార్మికులకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి చెప్పారు. సింగరేణిని తెలంగాణ అధికారులే గాడిన పెట్టారని సిఎం అన్నారు. సీనియర్ ఐఎఎస్ అదికారి ఎస్. నర్సింగ్ రావు సిఎండిగా ఉన్నప్పుడు సింగరేణి బాగుపడిందని, నేడు ఎన్.శ్రీదర్ నాయకత్వంలో గరిష్ట లాభాలు ఆర్ధించిందని చెప్పారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ಮಿುಖ್ಯಮಿಂತ್ರಿ అబినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగానే కాకుండ ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడుతున్న సింగరేణిని ಮಿಖ್ಯಮಿಂತ್ರಿ అబినందించారు. సింగరేణి ప్రాంతంలో డబుల్ టెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి, ఎమ్మెల్యేల కార్యాలయాల నిర్మాణానికి స్థలం సమకూర్చాలని సింగరేణి సిఎండిని ముఖ్యమంత్రి కోరారు.