విజయవాడకు సీఎం కేసీఆర్

260
KCR
- Advertisement -

ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరితే కనదుర్గమ్మ మొక్కు తీర్చుకుంటానని కేసీఆర్ మొక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ విజయవాడకు వెళ్లనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించనున్నారు.

మధ్యాహ్నం 11.30 గంటలకు దుర్గమ్మను దర్శించుకుని కుటుంబసమేతంగా అమ్మవారికి ముక్కుపుడక సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ రానున్నారు.

CM-KCR

ఇప్పటికే సీఎం కేసీఆర్ వరంగల్ భద్రకాళి అమ్మవారికి,కురవి వీరభద్ర స్వామికి బంగారుమీసం, తిరుపతి వేంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించిన సంగతి తెలిసిందే. ద్రకాళి అమ్మవారికి సీఎం బంగారు కీరిటాన్ని సమర్పించారు. రూ.3.70 కోట్ల విలువ గల 11 కిలోల 700 గ్రాముల బంగారు కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు.

ఇక తిరుమల శ్రీవారికి సైతం రూ. 5కోట్ల విలువైన స్వర్ణాభరణాలను స్వామివారికి సమర్పించారు. రూ.3.7 కోట్ల విలువైన 14.2 కిలోల స్వర్ణ సాలగ్రామహారం, రూ.1.21 కోట్ల విలువైన 4.65 కిలోల కంఠాభరణాన్ని టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు. కురవి వీరభద్రస్వామికి బంగారు కోర మీసాన్ని సమర్పించారు కేసీఆర్.

kcr

- Advertisement -