సిట్ నోటీసులకు బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ఇటీవల అందిన నోటీసుల నేపథ్యంలో తాను ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమై ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితా ఖరారు చేయడం, పార్టీ నేతలతో సమన్వయం వంటి కీలక పనులతో బిజీగా ఉన్న కారణంగా ఈ సమయంలో సిట్ ముందు హాజరుకావడం సాధ్యం కాదని తెలిపారు.
అయితే, చట్టానికి గౌరవం ఉందని, దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ పేర్కొన్నారు. విచారణకు హాజరవ్వడానికి సిట్ అధికారులకు అనువుగా ఉండే మరో తేదీని సూచించాలని ఆయన కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తైన అనంతరం సిట్ విచారణకు హాజరై అవసరమైన సమాచారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ పరిణామంతో కేసీఆర్ సమాధానం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



