కరీంనగర్‌కు కేసీఆర్..

39
- Advertisement -

నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతులకు భరోసాకల్పించేందుకు , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్  ఇవాళ శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో పర్యటించనున్నారు.

ఇందులో భాగంగా… ఉదయం 11:00 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుమ్ పూర్ గ్రామంలో ఎండిన పంట పొలాలను పరిశీస్తారు….రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజన కార్యక్రమం అనంతరం…మధ్యాహ్నం 2:00 గంటలకు బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పొలాలను పరిశీలిస్తారు. నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు.సాయంత్రం 3:00 గంటలకు శాభాష్ పల్లి బ్రీడ్జి వద్ద మధ్యమానేరు ప్రాజెక్టు ను పరిశీలిస్తారు.

అనంతరం…సాయంత్రం 4:00గంటలకు సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో పాల్గొంటారు.

Also Read:తెలంగాణలో సమైక్య సంక్షోభం!

- Advertisement -