కరీంనగర్‌లో సీఎం కేసీఆర్

237
Kcr for Karimnagar
- Advertisement -

రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ మార్చేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్న సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్ధాయిలో పరిశీలించేందుకు మూడు రోజుల  పర్యటనలో భాగంగా సీఎం కరీంనగర్ చేరుకున్నారు. కేసీఆర్‌కు టీఆర్ఎస్‌ నేతలు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

ప్రాజెక్టు పనులను హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్ సర్వే చేయడంతో పాటు మేడారం, రామడుగు‌లోని టన్నెల్స్‌ను కేసీఆర్ పరిశీలించనున్నారు. తర్వాత అధికారులతో పనులు జరుగుతున్న తీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. మిడ్‌ మానేర్‌ ప్రాజెక్టు నిర్వాసితులు  పరిహారం పెంపు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

Kcr for Karimnagar
గురువారం ఉద యం 9.00 గంటలకు కరీంనగర్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి భూపాలపల్లి జిల్లా తుపాకులగూడెం బ్యారేజీకి చేరుకుంటారు. అక్కడి బ్యారే జీ పనులను పరిశీస్తారు. అక్కడి నుంచి మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్ పనులు, అక్కడి నుంచి అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించిన తర్వాత సిరిపురం పంప్‌హౌస్ పనులను పరిశీలిస్తారు. అక్కడే భోజనం చేస్తారు. ఆ తర్వాత సుందిల్ల బ్యారేజీ పనులు, గోలివాడ పంప్‌హౌస్ పనులు పరిశీలించి, రాత్రి రామగుండంలోనే బస చేస్తారని అధికారులు తెలిపారు.

శుక్రవారం ఉదయం 9.20కి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మేడారం పంప్‌హౌస్‌ను పరిశీలిస్తారు. అనంతరం కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని పంప్‌హౌస్‌ను పరిశీలిస్తారు. అక్కడే భోజనం చేసి అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రాంపూర్‌లో జరుగుతున్న పంప్‌హౌస్ పనులను పరిశీలించి, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మిడ్‌మానేర్ పనులను పరిశీలించి తిరిగి హైదరాబాద్ పయనమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు.

- Advertisement -