- Advertisement -
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ ఇవాళ మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించింది. జస్టిస్ పీసీ ఘోష్.. సుమారు 50 నిమిషాల పాటు కేసీఆర్‌ను విచారించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కమిషన్‌కు కేసీఆర్ నివేదిక ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా కమిషన్‌కు కేసీఆర్ అందజేశారు. కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా నివేదిక సమర్పించారు కేసీఆర్.
కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్కే భవన్‌కు తరలివచ్చారు.
- Advertisement -

