బస్సుయాత్ర..హోటల్‌లో ఛాయ్ తాగిన కేసీఆర్

23
- Advertisement -

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఖమ్మం బస్సు యాత్ర తోవలో ఎల్లంపేట స్టేజీ తండా వద్ద రోడ్డు పక్కనే ఉన్న చిన్న ఛాయ్ హోటల్ వద్ద ఆగారు కేసీఆర్. అతిసామాన్యమైన తమ హోటల్ కు వచ్చిన కేసీఆర్ ను చూసి హోటల్ యజమాని సొందు వారి కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు.ఊహించని విధంగా మహా నేత కేసీఆర్ ను చూసి సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు..

తమ హోటల్ లో ఉన్న మిర్చిబజ్జి ఏదుంటే అది ప్రేమతో కేసీఆర్ కు అందించారు.వారి ప్రేమపూర్వక అతిద్యాన్ని స్వీకరించిన కేసీఆర్ వారితో కాలేగలుపుగా ఇంటి పెద్దగా కాసేపు ముచ్చటించారు.వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికుల వెతలు తెలుసుకుంటూ హోటల్ యజమాని ఎస్డీ సొందు అందించిన
చాయ్ తాగారు.

తండా సర్పంచ్ లాల్సింగ్ సహా పలువురు తమ ప్రియతమ నేత కేసీఆర్ వస్తున్నారని తెలిసి అక్కడకు చేరుకున్నారు. తమకు రైతు బంధు రావడం లేదని, రుణమాఫీ కాలేదని, నీళ్లందక పొలాలు ఎండిపోయినాయని కరెంటు రాట్లేదని తమ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వికలాంగులు మహిళలు వృద్ధులు కేసీఆర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.మీరు లేకపోవుడుతోటే ఇన్ని కష్టాలు సారు…మాయమాటలు నమ్మి మోసపోయినం సారు.. మల్లా మీరే రావాలే సారు.. ఇట్లైతదని అనుకోలే సారు..” అని తమ ప్రియతమ నేత కేసీఆర్ తో తమ గోస చెప్పుకున్నారు.

తమకు జరుగుతున్న కష్టాలను అక్కడికి వచ్చిన మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు.యువతీయువకులు కేసీఆర్ తో సెల్ఫీలు దిగారు.వారికి ఆప్యయంగా కరచాలనం చేశారు కేసీఆర్.బిఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వచ్చినయని వారికి తాను అండగా ఉంటానని కేసీఆర్ వారిని ఓదార్చారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మెడలు వంచి సాధిద్దామని.. రైతాంగం తరఫున తాను పంచాతీ పంజ్ వలె కొట్లాడి రైతు బంధు సహా అన్ని హామీలను సాధిస్తానని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు..

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి మోసపోయినట్టు మల్లా కాకుండా ఈ సారి లోకసభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ ఎంపీలను గెలిపించి తనను శక్తివంతుడిని చేయాలని కేసీఆర్ అన్నారు.మహబూబాద్ ఎంపీగా పోటీ చేస్తోన్న మాలోత్ కవితను గెలిపించాలని పిపుపునిచ్చారు.కాగా జై కేసీఆర్ జై తెలంగాణ కేసీఆర్ మళ్ళా రావాలి కేసీఆర్ సీఎం…నినాదాలతో ఎల్లంపేట చౌరస్తా తండా పరిసరాలు మారుమోగాయి.వారికి అభినందనలు తెలిపిన కేసీఆర్ ఖమ్మం వైపు ముందుకు కదిలారు.

Also Read:సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు

- Advertisement -