ఆస్పత్రి నుండి కేసీఆర్ డిశ్చార్జ్..

51
- Advertisement -

హైదరాబాద్ యశోద ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు మాజీ సీఎం కేసీఆర్.ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. ఆసుపత్రి నుంచి నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్లారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.

తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లను అమర్చారు. గత 6 రోజులుగా కేసీఆర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందగా ప్రస్తుతం కోలుకోవడంతో ఆయన్ని డిశ్చార్జ్ చేశారు.

Also Read:థమన్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్?

- Advertisement -