యశోద నుండి కేసీఆర్ డిశ్చార్జ్

18
- Advertisement -

స్వల్ప అస్వస్థత కారణంగా, గురువారం నాడు యశోద దవాఖానాలో అడ్మిట్ అయిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , వైద్యుల సలహామేరకు శనివారం డిశ్చార్జి అయ్యారు.

రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం, ఆరోగ్యం మెరుగ్గానే వుందని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని, యశోద ఆసుపత్రి వైద్యులు నిర్థారించిన సంగతి తెలిసిందే.

కాగా, వైద్య పరీక్షల్లో భాగంగా ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని, ఆ తర్వాత మరోసారి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వుంటుందని యశోద వైద్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో.. రానున్న గురు, శుక్ర వారాల్లో వైద్య పరీక్షల నిమిత్తం మరోసారి యశోద హాస్పటల్ కు అధినేత కేసీఆర్ వెళ్లనున్నారు. కాగా.. పూర్తి ఆరోగ్యంతో వున్న కేసీఆర్ గారు.. వైద్య పరీక్షల నడుమ విరామ సమయంలో, రాష్ట్రంలో సాగునీరు, రైతులు, వ్యవసాయం, తదితర ప్రజా సమస్యల మీద, గత రెండు రోజులుగా పార్టీ సీనియర్లతో చర్చిస్తూ సమాచారం తీసుకుంటూ తదనుగుణంగా సూచనలిస్తున్నారు.

కేసీఆర్ ని పాలమూరు జిల్లా పార్టీ సీనియర్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.

Also Read:War 2:వార్ 2 రైట్స్‌ సితారకే!

- Advertisement -