ఢిల్లీకి సీఎం కేసీఆర్…

260
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎర్రవల్లిలో రెండో రోజు యాగంలో పాల్గొని హారతి పూర్తయిన తర్వాత హస్తినకు
బయలు దేరనున్నారు. ఢిల్లీలో కేంద్ర అటవీ,పర్యావరణశాఖ మంత్రి హర్షవర్ధన్‌ కుమారుడు మయాంక్ వివాహ వేడుకలో
పాల్గొననున్నారు.బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రాత్రి తిరిగి హైదరాబమాద్‌కు రానున్నారు.

ఇక సర్వజనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేసీఆర్ ఆధ్వర్యంలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మహారుద్రసహిత సహస్ర చండీయాగం సోమవారం వేదమంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 300 మందిపైగా రుత్విక్కుల వేదపారాయణాలు, వేదమంత్రాలు ఎర్రవల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతిధ్వనించాయి.

విశాఖనుంచి ప్రత్యేకంగా వచ్చిన శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీస్వామి సమక్షంలో మేళతాళాలలో, మంత్రోచ్చారణతో యజ్ఞం ప్రారంభమైంది. ఐదురోజులపాటు కొనసాగనున్న యాగం..శుక్రవారం మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగియనుంది.

- Advertisement -