కవి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

142
cm kcr
- Advertisement -

ప్రముఖ పద్యకవి, రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరించుకున్నారు. సంప్రదాయ సంస్కారాన్ని, ఆధునిక విలువలను మేళవించి పద్య, వచన కవితను సమఉజ్జీగా పండించిన తిరునగరి కవితాధార గొప్పదని అన్నారు. ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -