- Advertisement -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో బీజేపీ వ్యవహరిస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమైన అరెస్ట్. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
మొన్న హేమంత్ సోరెన్, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్ ఘటనలే నిదర్శనం అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సహా దర్యాప్తు సంస్థలను కేంద్రం పావులుగా వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న కేంద్రం చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
Also Read:RSP:పీడిత ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేశా
- Advertisement -