బీసీల కోసం పకడ్బందీగా పథకాలు…

228
KCR calls for a marathon meeting with BC representatives today to finetune proposal
- Advertisement -

అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో నేడు అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని బీసీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

అలాగే బలహీన వర్గాల కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ వివరించారు. బీసీల అభివృద్ధికి సంబంధించి.. ఆయా వర్గాల నుంచి చాలా డిమాండ్లు, వినతులు వస్తున్నాయని తెలిపారు. బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలన్న డిమాండ్ ఉందన్నారు.

 KCR calls for a marathon meeting with BC representatives today to finetune proposal
బీసీల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం. బీసీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అందరి సూచనలను ప్రభుత్వం సానుకూలంగా స్వీకరిస్తుందని తెలిపారు. బీసీ ప్రజాప్రతినిధులు రెండు రోజుల పాటు అన్ని విషయాలపై చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సీఎం సూచించారు. ప్రజాప్రతినిధుల సూచనలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్.

 బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ ఎలా పని చేయాలో, స్వయం ఉపాధి పథకాల స్వరూపం ఎలా ఉండాలో సూచించాలని సీఎం కోరారు. సమాజంలో సగభాగం కన్నా అధికంగా ఉన్న బలహీనవర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.

అంతేకాకుండా దేశంలో విధానపరమైన స్థిరత్వం లేకపోవడమే ప్రధాన లోపమని సీఎం అన్నారు. బీసీల కోసం పకడ్బందీగా పథకాలు, విధానాలు రూపొందించాలని ఆయన సూచించారు. గురుకులాల్లో 91,520 మంది బీసీ పిల్లలకు అత్యున్నత విద్య అందుతోందని కేసీఆర్ గుర్తు చేశారు. ఒకరి పెత్తనం కింద మరొకరు బతకాల్సిన అవసరం లేదన్నారు సీఎం. మంచి పథకాలు, విధానాలతో బీసీల అభ్యున్నతికి అద్భుత బాటలు వేయవచ్చని తెలిపారు.

- Advertisement -