ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తొలుత ములుగులో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం, అటవీ కళాశాలను ప్రారంభించారు. అనంతరం గజ్వేల్‌లో సమీకృత వ్యవసాయ మార్కెట్, ఐవోసీ, మహతి ఆడిటోరియాలను ప్రారంభించారు.
గజ్వేల్ మార్కెట్ యార్డును ప్రారంభించిన అనంతరం స్ధానిక రైతులతో మాట్లాడారు. రూ. 2 వేలు ఇచ్చి కూరగాయాలను కొనుగోలు చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా కూరగాయలను కోనుగోలుచేశారు. మార్కెట్లో సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
K Chandrasekhar Rao the Chief Minister of Telangana today visited the Vegetable and mutton market in Gajwel.KCR buys Rs 2000 vegetables